సాహితి ఇన్‌ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు

హైదరాబాద్‌: సాహితి ఇన్‌ఫ్రాపై సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్‌)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్‌ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్‌ పేరుతో కస్టమర్ల నుంచి వందల కోట్లను సాహితి ఇన్‌ఫ్రా వసూల్‌ చేసిన విషయం తెలిసిందే. సాహితి ఇన్‌ఫ్రా స్కామ్‌ మొత్తం రూ. 1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. 9 ప్రాజెక్టుల పేరుతో భారీ మోసం చేశారు.రియల్‌ ఎస్టేట్‌ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్‌ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్‌ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

➡️