వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఆర్‌

Apr 10,2024 20:32 #Former YCP MLA, #join ycp

ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : మాజీ ఎమ్మెల్యే, రాయచోటి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌ రమేష్‌ కుమార్‌రెడ్డి బుధవారం వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద ఆయనతో పాటు ఆయన ప్రధాన అనుచరులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే చేరికతో నియోజక వర్గంలో వైసిపికి మరింత బలం చేకూరిందని నాయకులు పేర్కొన్నారు. వైసిపిలో చేరినవారిలో లక్కిరెడ్డిపల్లె మాజీ జడ్‌పిటిసి సభ్యులు మోహనరెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎంపిపి ఉమాపతిరెడ్డి, మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కె ప్రభాకరరెడ్డి, ఆస్పత్రి కమిటీ మాజీ చైర్మన్‌ షేక్‌ హుస్సేన్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఓలుదాసు కృష్ణమూర్తి, మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి రమణారెడ్డి, దివ్యకుమార్‌రెడ్డి, పలువురు ఇతర నేతలు ఉన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️