వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స : సీఎం జగన్‌

Dec 13,2023 16:15 #ap cm jagan, #sameeksha meeting

అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు.సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కఅషి చేసింది. దీంట్లో భాగంగానే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం” అని సీఎం పేర్కొన్నారు.” వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది” అని సీఎం చెప్పారు.”ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకునేందుకు(ఫాలో అప్‌ కన్సల్టేషన్‌) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలి. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి. 19నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గనాలి. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలి. దీంతో పాటు వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి” అని సీఎం జగన్‌ ఆదేశించారు.వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి. అర్బన్‌ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండాలి. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలను నిర్వహించాలి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలి. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కఅష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️