ఉల్లాసంగా సంధ్యామెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌

Dec 17,2023 10:00 #Fun, #Sandhyamarines, #Vizag Marathon

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ నిర్వహించే సంధ్యా మెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌ సెకండ్‌ ఎడిషన్‌ విశాఖపట్నంలో, బీచ్‌ రోడ్‌, పార్క్‌ హౌటల్‌ పక్కన ఉన్న ఎంజిఎం పార్క్‌ వద్ద ఆదివారం ఉదయం కోలాహల వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ బాలకృష్ణా రారు మాట్లాడుతూ … వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ నిర్వహించే ఈవెంట్‌ లో 21 కిలోమీటర్ల ఫుల్‌ మరధాన్‌, తో పాటు 10కె, 5కె, 3కె రన్‌ విభాగాల్లో నిర్వహించిన ఈ ఈవెంట్‌ లో విశాఖ నగర ప్రజల తో పాటు 4 దేశాలు 21 రాష్ట్రాల నుండి సుమారు 8000 మంది రన్నర్లు పాల్గొన్నారని అన్నారు. ఈ మారథాన్‌ లో పాల్గొనే రన్నర్‌లందరికీ అత్యుత్తమ క్లాస్‌ రన్నింగ్‌ అనుభవాన్ని కలిగించడంతోపాటు నిర్మలమైన విశాఖపట్నం ప్రకృతి సౌందర్యంతో డెస్టినీ నగరంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతేకాకుండా ఇదే వేదిక గా ఆంధ్రప్రదేశ్‌ పోలీసువారి సహకారం తో డ్రగ్స్‌కు వ్యతిరేకంగాను గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారి సహకారంతో నో ప్లాస్టిక్‌ ఎకో-వైజాగ్‌ కోసం ప్రచారం లో భాగంగా వైజాగ్‌ను ప్లాస్టిక్‌ రహితంగా మార్చే సామాజిక, పర్యావరణ అనుకూల డ్రైవ్‌కు మద్దతు గా తాము ప్రచారం చేస్తున్నామని తెలిపారు. వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ కార్యదర్శి కంచేటి శ్రీనివాస్‌, వరుణ్‌ గ్రూప్‌ అధినేత ప్రభు కిషోర్‌ లతో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

➡️