బందరు బీచ్‌లో త్రిబుల్‌ ఐటి విద్యార్థి గల్లంతు

నూజివీడు (కృష్ణా) : బందర్‌ బీచ్‌లో నూజివీడు త్రిబుల్‌ ఐటి విద్యార్థి గల్లంతైన ఘటన ఆదివారం జరిగింది. నలుగురు విద్యార్థులు ఈరోజు ఉదయం బందరు బీచ్‌కు సరదాగా వెళ్లారు. సముద్ర స్నానానికి దిగారు. సముద్రపు అలలు ఉధృతంగా రావడంతో నలుగురు నీళ్లలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న మెరైన్‌ పోలీసులు వెంటనే గమనించి నీటిలో కొట్టుకుపోతున్న విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. అయితే తోకల.అఖిల్‌ జాడ కనిపించలేదు. అఖిల్‌ కోసం మెరైన్‌ పోలీసులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. గల్లంతయిన అఖిల్‌ కోసం మెరైన్‌ ఎస్‌ఐ సుభాష్‌ చంద్రబోస్‌ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

➡️