పార్లమెంట్‌ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్‌ని కోరిన సీపీఐ

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి అనుకూలంగా ఓటు రావడం లేదని తెలిపారు. పార్టీని పెంచుకోవాలని నిర్ణయించామన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో కలిసి పని చేస్తామన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి కాంగ్రెస్‌ అని తెలిపారు. పార్లమెంట్‌ లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ ని అడుగుతున్నామని అన్నారు. నల్గండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్‌, పార్లమెంట్‌ సీట్లలో బలం మాకు ఉందన్నారు.కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల ఆమలుకు కొంత సమయం ఇస్తామన్నారు. ఆరు నెలల గడువు ఇచ్చి.. ప్రభుత్వాన్ని అడుగుతామన్నారు. బీఆర్‌ఎస్‌ చాలా చేశాం అని అనుకుంటున్నారని, కానీ పేపర్‌ వర్క్‌ తప్పితే..ప్రాక్టికల్‌ గా లేదన్నారు. బీఆర్‌ఎస్‌ తొందపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు ఉందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదన్నారు. జరిగిన మార్పు ని బీఆర్‌ఎస్‌ అంగీకరించ లేకపోతున్నారని అన్నాఉ. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడాన్ని బీఆర్‌ఎస్‌ జీర్ణించుకోలేక పోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

➡️