నేడు గ్యాడ్యువేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌

హైదరాబాద్‌ : ఎంపీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ చెరి సగం సీట్లు గెలుచుకున్నాయి. ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది. కాగా, ఇక అందరి దఅష్టి గ్యాడ్యువేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై పడింది. నేడు తెలంగాణలో గ్యాడ్యువేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ జరగనుంది. వరంగల్‌-ఖమ్మం-నల్గండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి పైడి రాకేష్‌ రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

➡️