నేడు అంతరిక్షంలోకి ఇన్‌శాట్‌ 3-డిఎస్‌ ఉపగ్రహం

Feb 17,2024 11:06 #PSLV-C58 rocket, #srihari kota
  • జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 కౌంట్‌డౌన్‌ ప్రారంభం 

ప్రజాశక్తి – సూళ్లూరుపేట (తిరుపతి) :జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 కౌంట్‌డౌన్‌ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2272 కిలోల బరువు కలిగిన ఇన్‌శాట్‌ 3-డిఎస్‌ శాటిలైట్‌ను భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. జియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జిఎస్‌ఎల్‌వి) సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజన్‌తో ఈ రాకెట్‌ను రూపొందించారు. మూడు దశలతో నిర్మించిన ఈ రాకెట్‌ 19 నిమిషాల్లోనే అంతరిక్ష కక్ష్యకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. 167 కిలోమీటర్లు 173 మీటర్ల పెరిజి, 33,540 కిలోమీటర్లు, 40,781 కిలోమీటర్ల అపోజీల మధ్య వృత్తాకార కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. షార్‌కు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ చేరుకొని ప్రయోగ సన్నాహాలు చేపట్టారు.

➡️