ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

Apr 30,2024 12:25 #Sarpanch
  • పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ, యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై ఐక్యరాజ్యసమితిలో మాట్లాడనున్నారు.
➡️