హిందుస్తాన్‌ షిప్‌యార్డు కాంట్రాక్టుకు గండి?

Jan 3,2024 09:02 #Hindhustan Shipyard
hindustan ship yard contractor

 

  • అడ్డదారిలో ఎంట్రీకి ఎల్‌అండ్‌టి యత్నం

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖపటుం హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కొద్ది నెలల క్రితం రూ.19 వేల కోట్ల ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ల ఆర్డర్‌ దక్కించుకున్నా, తాజాగా కేంద్రం మరో ప్రయివేట్‌ కంపెనీ టెండరుకు మార్గం సుగమం చేసినట్లు సమాచారం. దీంతో, హిందుస్తాన్‌ షిప్‌యార్డు అధికార, ఉద్యోగ వర్గాల్లో సదరు ప్రయివేట్‌ కంపెనీ ప్రవేశంపై తీవ్ర ఆందోళన మొదలైంది. పైన తెలిపిన కాంట్రాక్టులో సగానికిపైగా ప్రయివేట్‌ కంపెనీ కొట్టేస్తే షిప్‌యార్డు ఆదాయానికి తీవ్ర గండిపడి మనుగడే ప్రమాదంలో పడనుంది. ఈ కాంట్రాక్టు షిప్‌యార్డుకు రాకుండా కేంద్రం ఏదో ఒక మెలిక పెడుతూ ఎల్‌అండ్‌టిని రంగప్రవేశం చేయించే పనిలో ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. నేరుగా షిప్‌యార్డుకు ఇవ్వొద్దని కేంద్రంపై ఎల్‌అండ్‌టి అప్పట్లో ఒత్తిడి తెచ్చింది. వాస్తవానికి 2010లోనే షిప్‌యార్డుకు దక్కాల్సిన రూ.వేల కోట్ల కాంట్రాక్టు ఇది. షిప్‌యార్డును ఇండియన్‌ నేవీకి అవసరమైన యుద్ధనౌకల తయారీకి సిద్ధం చేసే క్రమంలో నేవీలో విలీనం చేసినప్పటిది ఈ ఆర్డర్‌. కానీ, 2014లో కేంద్రంలో బిజెపి సర్కారు వచ్చినప్పటి నుంచీ ఈ ఎఫ్‌ఎస్‌ఎస్‌ల కాంట్రాక్టును పెండింగులో పెట్టేసింది. కొనాుళ్లపాటు ఎల్‌అండ్‌టి సంస్థ అయితే చేయగలదని షిప్‌యార్డుకు ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఈ కాంట్రాక్టును దక్కకుండా చేసింది. అయితే, నౌకా నిర్మాణ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉను హిందుస్థాన్‌ షిప్‌యార్డు 2022 ఆగస్టులో ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల మేర టరోువర్‌ గ్యారెంటీ అంటూ ఆ సంస్థ సిఎండి హేమంత్‌ ఖత్రీ ఆ సందర్భంగా ప్రకటించారు.

 

  • అంతలోనే ఏం జరిగింది?

కేంద్రం తాజా వాదనలు చూస్తే ఆశ్చర్య పడాల్సిందే. రూ.వేల కోట్ల కాంట్రాక్టు చేసేందుకుషిప్‌యార్డులో అధునాతన మౌలిక సదుపాయాలు లేవని, ప్రాథమిక పెట్టుబడి లేనందున కనీసం రెండు ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)లను ఎల్‌అండ్‌టి సంస్థకుకాంట్రాక్టులో భాగం చేయాలనిపైనుంచి షిప్‌యార్డు అధికారులపై ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హిందుస్థాన్‌ షిప్‌యార్డు అధికారుల్లో తాజాగా తర్జనభర్జన సాగుతోంది. ఎల్‌అండ్‌టికి ఎంట్రీ ఇస్తే షిప్‌యార్డుకు మనుగడ ఉండదనికేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం.

 

  • షిప్‌ బిల్డింగ్‌కు ఆస్కారం లేదా?

విశాఖపట్నం షిప్‌యార్డులో నాలుగు స్లిప్‌ వేలు ఉన్నాయి. ఇవి నౌక తయారైన తర్వాత నీటిలోకి జారిపోయే యంత్ర పరికరాల వ్యవస్థ. ప్రస్తుతం రెండు సిద్ధంగా ఉన్నాయి. చాలా వరకూ ఈ స్లిప్‌వేలలో ఎక్విప్‌మెంట్‌ సక్రమంగా లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అప్‌ గ్రేడేషన్‌ ఈ కాలంలో జరగలేదనుది అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ సాకుతో కేంద్రం ఎల్‌అండ్‌టినిరంగంలోకి దించేయడం సరైంది కాదని వారంటున్నారు. గడిచిన పదేళ్లలో షిప్‌యార్డుకు సరైన ఆర్డర్లు లేనందున స్లిప్‌ వేల దగ్గర ఇన్‌ఫ్రా సమకూర్చులేకపోయామని, బ్యాంకు నుంచి రుణానికి అవకాశం ఇవ్వాలనికేంద్రానిు వేడుకున్నా నిరాకరించిందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఐదు ఎఫ్‌ఎస్‌ఎస్‌ల నిర్మాణ ఆర్డర్‌ కాంట్రాక్టు అంతా ఇండియన్‌ నేవీదే. ఈ కాంట్రాక్టు షిప్‌యార్డుకు దక్కిన రోజు నుంచే కాంట్రాక్టు అమల్లో ఉంటుంది. అంటే, రెండేళ్లలో మొదటి షిప్‌ నిర్మించి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి ఎనిమిది నెలలకూ ఒక నౌకను ఇచ్చేయాలి. ఇలా ఏడేళ్లలో ఐదు ఎఫ్‌ఎస్‌ఎస్‌లు తయారు చేసి ఇవ్వాలి.

 

  • తగ్గిపోయిన వర్క్‌మెన్‌!

దేశంలోనే తొలి నౌకానిర్మాణ కేంద్రం 1941 జూన్‌లో విశాఖలో హెచ్‌ఎస్‌ఎల్‌గా ఏర్పాటైంది. 2010 వరకూ ఏడు వేల మంది మ్యాన్‌పవర్‌ (స్టాఫ్‌, వర్క్‌మెన్‌ కలిపి) ఉండేది. నేడు పర్మినెంట్‌ వర్కర్లు 370 మందే ఉన్నారు. నైపుణ్యంగల వారిలో ఎక్కువమంది రిటైరైపోయారు. షిప్‌యార్డులో అవుట్‌ సోర్సింగ్‌ మ్యాన్‌పవర్‌ 2000 ప్రస్తుతం ఉనాు, నైపుణ్యంగల పనులు చేయలేరనిఅంటునాురు. ఈ నేపథ్యంలో షిప్‌యార్డు యాజమాన్యం కూడా ఎల్‌అండ్‌టి అడ్డదారిలో ప్రవేశిస్తునాు గట్టిగా వ్యతిరేకించకుండా మెత్తబడిందను చర్చ జరుగుతోంది. తొలుత రెండు ఎఫ్‌ఎస్‌ఎస్‌లతో ఎల్‌అండ్‌టి మొదలుపెట్టి మొత్తం ఐదు ఎఫ్‌ఎస్‌ఎస్‌ల నిర్మాణం లాగేసుకుంటుందను అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి.

➡️