విశాఖ మీదుగా హోలీ ప్రత్యేక రైళ్లు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : హోలీ పండుగ సీజన్‌లో అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. 08845 సంత్రాగచ్చి – మహబూబ్‌నగర్ ప్రత్యేక రైలు మార్చి 18, 25 -2024 తేదిలల్లో మధ్యాహ్నం 12.50 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరి అదేరోజు అర్ధరాత్రి 01.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది మరల 02.00 గంటలకు బయలుదేరి సాయత్రం 18.00 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. 08846 మహబూబ్‌నగర్ – సంత్రాగచ్చి ప్రత్యేక రైలు మార్చి19,26 తేదిలల్లో రాత్రి 20.20 గంటలకు మహబూబ్‌నగర్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది మరల 11.20 గంటలకు బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 00.15 గంటలు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఈ రైళ్ళు జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ, మలకజ్‌గిరి, నలగొండ, మిర్యాలగూడ, సత్తెన్నపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్‌కోట్, విశాఖపట్నం, విజయనగరం, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, సంస్త్రాగ్‌నగర్, భద్రాగ్‌నగర్ మీదుగా ప్రయాణిస్తాయి.

చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రత్యేక రైళ్లు

08836 సంత్రాగచ్చి – ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ రైలు 23 మార్చి-2024 సాయంత్రం 18.00 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరి ,మరుసటి రోజు ఉదయం 07.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది మరల 07.20 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 20.30 గంటలకు చెన్నై చేరుకుంటుంది.08837 ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ – సంత్రాగచ్చి ప్రత్యేక రైలు 25 మార్చి-2024 ఉదయం 10.45 గంటలకు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి ,అదే రోజు రాత్రి 23.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది మరల 23.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఈ రైళ్ళు గూడూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తాయి.

➡️