నవరత్నాల్లో కేంద్రం ఇచ్చిందెంత? – రాష్ట్ర సర్కారుకు కాగ్‌ ప్రశ్న

Dec 8,2023 08:25 #CAG

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి(అమరావతి) :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలపై కాగ్‌ఆరా తీస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా లేఖలు రాసిన కంప్ట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) తాజాగా మరో లేఖ రాసింది. సమాచార హక్కు చట్టంకింద కొందరు ఈ పథకాల వివరాలు కోరాలని, వారికి సమాధానం ఇవ్వాల్సిఉన్నందున సాధ్యమైనంత తరగా వివరాలు అందచేయాలని తాజా లేఖలో కాగ్‌ కోరింది. నవరత్నాల్లో భాగంగా అమలు చేసే వివిధ పథకాలకు రాష్ట్రం ఎంత నిధులు విడుదల చేసింది? కేంద్రం నుండి అందిన నిధులు ఎంత? తదితర వివరాలను తెలియచేయాలని తాజా లేఖలో కోరింది. ఇప్పటికే కేంద్ర నిధులను రాష్ట్ర పథకాల అమలుకు ఖర్చు చేస్తున్నారంటూ బిజెపి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఇటువంటి లేఖే రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. అమలు చేస్తున్న పథకాలకు ఆడిట్‌ జరగడం లేదని, ఆడిట్‌ చేసిన వివరాలు సమర్పిరచాలని ఐదు నెలల క్రితం ప్రిన్సిపల్‌ అక్కౌెంటెంట్‌ జనరల్‌ (పిఎజి) నురచి లేఖ వచ్చిరది. రాష్ట్రరలో నవరత్నాల పేరిట జగనన్న విద్యా కానుక, వైఎస్‌ఆర్‌ గోరుముద్ద, వైఎస్‌ఆర్‌ గృహవసతి, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ వంటి పథకాలపై ఆడిట్‌ కోసం పిఎజి లేఖ రాయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ పథకాలతోపాటు కేంద్ర నిధులతో అమలు చేసే స్వచ్ఛ భారత్‌ మిషన్‌, జాతీయ గ్రామీణ లైవ్లీహుడ్‌ మిషన్‌, ప్రధాన మంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ వంటి పథకాలపైనా వివరాలు కోరడం గమనార్హం. ఈ లేఖకు ఇరకా ఆర్థికశాఖ నురచి సమాధానం వెళ్లకమురదే మరోసారి కాగ్‌ నురచి లేఖ వచ్చింది. వినియోగ ధ్రువీకరణ పత్రాలు రావడం లేదంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్న కేంద్రం.. రాష్ట్ర పథకాల అమలుపై ఆరా పేరుతో ఒత్తిడి తీసుకువస్తోరదని రాష్ట్ర అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️