గజ్వేల్‌లో భారీ నగదు సీజ్‌

Mar 23,2024 13:34 #Gajwel, #Huge cash, #seized

గజ్వేల్‌ : ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో … గజ్వేల్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా, పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. బచ్చు రత్నాకర్‌కు చెందిన కారు (టీఎస్‌36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్‌ సిపి అనురాధ మాట్లాడుతూ …. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని సూచించారు. అంతకుమించి అధికంగా తీసుకెళ్లినట్లయితే సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలని లేనిపక్షంలో ఆ మొత్తాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామని, సరైన ధ్రువపత్రాలు చూపించి బాధితులు విడిపించుకోవచ్చని తెలిపారు.

➡️