కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లు పేలుడు

Feb 20,2024 11:36 #Fatal fire accident, #karimnagar

కరీంనగర్‌: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్‌ నగర్‌లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. ఈ పేలుడు కారణంగా చుట్టు పక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ గుడిసెల్లో నివసించే కార్మికులంతా మేడారం జాతరకు కుటుంబసమేతంగా తరలి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి గత 20 ఏళ్లుగా కార్మికులు ఆ పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️