హైదరాబాద్‌ లోక్‌సభ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన

తెలంగాణ : హైదరాబాద్‌ లోక్‌సభ బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రకటిస్తూ … కెసిఆర్‌ ఆయన పేరును ఖరారు చేశారు. ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, వరంగల్‌ – డాక్టర్‌ కడియం కావ్య, జహీరాబాద్‌ – అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ – బాజిరెడ్డి గోవర్ధన్‌, కరీంనగర్‌ – వినోద్‌కుమార్‌, పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం – నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ – మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ – ఆత్రం సక్కు, సికింద్రాబాద్‌ – పద్మారావుగౌడ్‌, భువనగిరి – క్యామ మల్లేశ్‌, నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి, నాగర్‌కర్నూల్‌ – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ – వెంకట్రామిరెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది.

➡️