రానున్న కాలంలో జనసేన కనుమరుగు : ముద్రగడ

Mar 16,2024 20:07 #Mudragada, #politics

ప్రజాశక్తి – కిర్లంపూడి : రానున్న కాలంలో జనసేన పార్టీ కనుమరుగవుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి జగన్‌ సమక్ష్యంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తన నివాసంలో శనివారం విలేకరులతో ముద్రగడ మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. వైసిపి స్థాపనలో తానూ ఉన్నానని, కొన్ని శక్తులు జగన్‌తో కలవకుండా అప్పట్లో దూరం చేశాయన్నారు. వైసిపిలో చేరడంపై కొందరు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారని, అయితే తనను ట్రోలింగ్‌ చేసేవారు నిజానిజాలు తెలుసుకొని వ్యవహరించాలన్నారు. కాపు ఉద్యమం సమయంలో పవన్‌కల్యాణ్‌ ఎక్కడ ఉన్నాడని, ఏ మడుగులో దాక్కున్నారని ప్రశ్నించారు. ‘అసలు పవన్‌కల్యాణ్‌ ఎందులో గొప్ప, సినిమా ఇండిస్టీలో గొప్పోడు అయితే అవ్వొచ్చు రాజకీయాల్లో మాత్రం నేనే గొప్ప’ అని చెప్పారు. తన కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం దాడి చేసినప్పుడు పవన్‌ కనీసం సానుభూతి అయినా తెలిపారా? అని ప్రశ్నించారు.

➡️