ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చేదు అనుభవం

Jun 16,2024 14:24 #bitter experience, #IAS officers

అమరావతి : ఎపి పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సిఎస్‌ శ్రీలక్ష్మికి చేదు అనుభవం ఎదురయ్యింది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్‌ తెచ్చారు. అయితే సంతకం పెట్టడానికి మంత్రి నిరాకరించారు. ఆ దస్త్రాన్ని తిప్పిపంపారు. ఇప్పుడు సమయం కాదంటూ … తిరస్కరించారు. మరోవైపు రెండురోజుల క్రితం శ్రీలక్ష్మిని సిఎం చంద్రబాబు తన షేషీ నుంచి బయటకు పంపారు. ఆమె నుండి పుష్పగుచ్ఛాన్ని తీసుకోకుండా నిరాకరించారు. జిఒలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.

➡️