మన్యం బంద్‌కు మద్దతుగా.. ఈనెల 9న ‘జనరక్షణ దీక్ష’

విజయవాడ : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటించాలని, జిఒ నెంబర్‌ 3 ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ … ఈ నెల 10న ఆదివాసీ సంఘాలు తలపెట్టిన మన్యం బంద్‌కు మద్దతుగా … సిపిఎం ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష మార్చి 9వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ లెనిన్‌ సెంటర్‌ లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొననున్నారు. ఈ బంద్‌కు సంఘీభావంగా ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని గిరిజన జిల్లాల్లో ఆదివాసీ జనరక్షణ దీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ దీక్షలను, మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని గిరిజలను కోరారు. ఆదివాసీల హక్కులను హరిస్తోన్న బిజెపి, దానికి మద్దతు ఇస్తున్న టిడిపి, జనసేన, వినాశకర వైసిపిలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తమను విస్మరించిన పార్టీలకు బుద్ధి చెప్పేందుకు గిరిజన ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

 

➡️