సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం: భట్టి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడంతో పాటు వారికిచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు 30 రోజుల కాంగ్రెస్‌ పాలనపై ఆయన ట్వీట్‌ చేశారు.’రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ వాటిని అధిగమించి.. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. విభజన హామీల అమలు కోసం కేంద్రానికి విన్నవిస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా పాలన కొనసాగిస్తాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఇప్పుడు పాలన, అభివృద్ధే ముఖ్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం సమష్టి బాధ్యత. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసమే ఏర్పాటు చేశారని.. పౌరులు అనుకునే విధంగా మా పరిపాలన సాగుతుంది” అని తెలిపారు.

➡️