రాజమండ్రిలో 5, 6, 7 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు మహాసభ

Jan 1,2024 08:19

-ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా):రాజమండ్రిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభ కరపత్రాలను అద్దంకిలోని రోటరీ సంస్థ కార్యాలయంలో సాహితీ మిత్రమండలి గౌరవాధ్యక్షులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా డాక్టర్‌ కేశిరాజు శ్రీనివాస్‌, తెలుగు భాషాభిమాని చైతన్యరాజు నిర్వహణలో రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషలోని 25 ప్రక్రియలపై సదస్సులు, గ్రంథావిష్కరణలు, కళా ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. తెలుగు భాషా వైభవాన్ని చాటే తెలుగు మహాసభను జయప్రదం చేయాలని కోరారు. సాహితీ మిత్రమండలి, అద్దంకి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు లక్కరాజు చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించారు. కె.వి.పోలిరెడ్డి, లక్కరాజు శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️