IRR CASE : చంద్రబాబు పిటిషన్‌ పై విచారణ వాయిదా

అమరావతి : ఐఆర్‌ఆర్‌ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎపి హైకోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్‌ పై బుధవారం జరిగిన విచారణ డిసెంబర్‌ 1వ తేదీకి వాయిదాపడింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ లో అవకతవకలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు తరపున ఇప్పటికే సీనియర్‌ న్యాయవాది నాగముత్తు తన వాదనలను వినిపించారు. దీనిపై విచారణ డిసెంబర్‌ 1కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

➡️