ఎపిఐఐసి చైర్మన్‌గా ‘జంకె’ బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా): ఎపిఐఐసి చైర్మన్‌గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు అవకాశం లేకపోవడంతో ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డికి గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు, మార్కాపురం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబర్‌ డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, డాక్టర్‌ షేక్‌ మక్బుల్‌బాష, పిఎల్‌పి యాదవ్‌, మందటి మహేశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

➡️