జాహ్నవి కేసులో న్యాయం జరిగేలా చూడాలి : కెటిఆర్‌

Feb 22,2024 18:03 #KTR

హైదరాబాద్‌ : అమెరికాలో తెలుగు విద్యార్థిని కందు జాహ్నవి మృతి చెందింది. ఆమె మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేనందున అతనిపై నేరాభియోగాలు మోపడం లేదని చెప్పడంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖామంత్రి జైశంకర్‌ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి.. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురవాలి. ఉన్నత లక్ష్యాలతో అగ్రరాజ్యం వెళ్లిన జాహ్నవి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమైతే.. ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధకరం అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢకొీని మృతి చెందిన విషయం తెలసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఆమె మరణానికి విలువే లేదు. ఇదంతా సాధారణమే అని చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి డేనియల్‌ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్‌ చేసింది. దీంతో ఆయనను సస్పెండ్‌ చేశారు.

➡️