విజయవాడ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

విజయవాడ : రాష్ట్ర భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ … బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసస చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ … చట్టం రూపొందించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న అప్పిలేట్‌ అథారిటి ఎవరనేది చట్టంలో స్పష్టంగా నిర్వచించకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు. జిల్లా కోర్టుల ప్రమేయం లేకుండా హైకోర్టులు కేసులను తీసుకోబోవని చెప్పారు… కానీ, తాజా చట్టంలో అలాంటి వాటికి అవకాశం కల్పించటాన్ని న్యాయవాదులు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️