డెంగీతో బాధపడుతున్న మంత్రి కొండా సురేఖ

Feb 19,2024 14:41 #dengue fever, #konda surekha

హైదరాబాద్‌ : తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. డెంగీ జ్వరంతో ఆమె బాధపడుతున్నారు. తన మంత్రిత్వ శాఖల కార్యక్రమాలను హైదరాబాద్‌లోని తన నివాసం నుంచే ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులుగా జ్వరం తగ్గక పోవడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా డెంగీ అని బయటపడింది. జ్వరంతో బాధ పడుతూనే మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన సలహాలు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

➡️