అవగాహన లేకే దుష్ప్రచారం : సజ్జల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఈ ఐదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వం సంక్షేమంతోపాటు పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ప్రతిపక్షాలకు అవగాహన లేకే దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేశామన్నారు. చంద్రబాబు హయాంలో హామీ ఇచ్చిన డ్వాక్రా రుణాలను, సున్నా వడ్డీని అమలు చేయలేదన్నారు. జగన్‌ హయాంలో డ్వాక్రా గ్రూపులు బలోపేతం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కియాను మించిన పర్రిశమలు చాలా వచ్చాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నా.. అభివృద్ధి లేదని దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

➡️