టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌

Apr 10,2024 17:46 #joined TDP, #MLC Iqbal
  •  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

ప్రజాశక్తి-హిందూపురం : ఇటీవల వైసిపికి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం టిడిపిలో చేరారు. చంద్రబాబు ఆయనకు తెలుగుదేశం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా ఇక్బాల్‌ పోటీ చేశారు. బాలకృష్ణపై ఓడిపోయిన ఆయన హిందూపురం వైసిపి సమన్వయకర్గగా, ఎమ్మెల్సీగా కొనసాగారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన్ను వైసిపి సమన్వయకర్తగా అధిష్టానం తొలగించడంతో అప్పటి నుంచి ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. గత నాలుగురోజుల క్రితం వైసిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఇక్బాల్‌ రాకతో టిడిపి మరింత బలోపేతం అవుతుందని టిడిపి హిందూపురం పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌ తెలిపారు.

➡️