Mlc kavita   : బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

న్యూఢిల్లీ  :    ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పుని కోర్టు రిజర్వ్‌ చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గురువారం ఢిల్లీలోని రోస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తీర్పుని రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

లిక్కర్‌పాలసీ కేసులో మార్చి 15న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్‌ జైలులో ఉన్నారు.

➡️