నాగర్‌ కర్నూల్‌లో మోడి సభ – బిజెపి భారీ జనసమీకరణ..!

Mar 16,2024 12:43 #BJP, #gathering, #meeting, #modi, #Nagar Kurnool

నాగర్‌ కర్నూల్‌ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో … తెలంగాణపై బిజెపి గురిపెట్టింది. ఎంపి ఎలక్షన్లపై ఫోకస్‌ పెట్టిన కమలం పార్టీ వరుస సభలతో హడావిడి చేస్తోంది. శుక్రవారం మల్కాజ్‌గిరి రోడ్‌షోలో పాల్గొన్న ప్రధానమంత్రి మోడి … శనివారం నాగర్‌ కర్నూలులో జరుగుతున్న బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడి ఈరోజు ఉదయం 11 గంటలకు నాగర్‌ కర్నూలుకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్‌ అయిన నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ సీటుపై కమలం పార్టీ కన్నేసింది. ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్‌ ఎంపి రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్‌పిటిసి భరత్‌ ప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచార పర్వంలో తలమునకలైంది. నాగర్‌కర్నూలులో జరుగుతున్న ప్రధాని సభను.. సూపర్‌ హిట్‌ చేసేందుకు కమలం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. భారీగా జనసమీకరణ చేపట్టింది. ప్రస్తుతం నాగర్‌కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడి ప్రసంగిస్తున్నారు.

➡️