ప్రజాక్షేత్రంలో పోటీ పక్కా : ఎంపి రఘురాం కృష్ణంరాజు

Apr 4,2024 21:12 #mp raghurama, #press meet

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ : ఈ ఎన్నికల్లో తాను పక్కాగా పోటీలో ఉంటానని నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే, తాను పార్లమెంటుకు వెళ్లాలనుకుంటున్నానని, ప్రజలు అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే తాను టిడిపి కూటమి తరుపున పోటీ చేస్తానని చెప్పానన్నారు. నరసాపురం ఎంపి సీటు తనకు కేటాయిస్తే రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని తెలిపారు. అయితే, తాను పోటీ చేసేది ఎంపి స్థానానికా, ఎమ్మెల్యే స్థానానికా అనేది రెండు రోజుల్లో తేలుతుందన్నారు. తాను అసెంబ్లీ సీటు అడగలేదని, నరసాపురం ఎంపి సీటు అడుగుతున్నానని స్పష్టం చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబును కలవనున్నట్లు చెప్పారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని, టిడిపి కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

➡️