మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి’

Mar 29,2024 13:30 #machilipatnam, #Nara Bhuvaneshwari

ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : ‘నిజం గెలవాలి’ కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగింది. మచిలీపట్నం పట్టణం, 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగా సోమయ్య చిత్రపటానికి పులా వేసి నివాళులర్పించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో (29-10-2023)న సోమయ్య(63) మృతి చెందారని తెలిపారు. సోమయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. భువనేశ్వరి వెంట మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️