నందినాటకోత్సవ ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవ తుది ప్రదర్శన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర చలన చిత్ర టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 23 నుంచి 29 తేదీ వరకు తుది ప్రదర్శనల పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వేదిక, సీటింగ్‌ గ్యాలరీలు, ఆవరణ వీక్షించారు. నాటకోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధిత జిల్లా శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలు వీక్షించే విధంగా విజ్ఞాన మందిరం బయట ఖాళీ స్థలంలో ఎల్‌ఇడి డిస్ప్లేను ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులకు బస, భోజన, ప్రయాణ వసతుల కల్పనలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజరు కుమార్‌రెడ్డి, ఎఫ్‌డిసి జనరల్‌ మేనేజర్‌ శేషసాయి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రభాకరరెడ్డి, సమాచార శాఖ ఉప సంచాలకులు అబ్దుల్‌ రఫీక్‌, విశ్రాంత జాన్సన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా వైస్‌ చైౖర్మన్‌ రామచంద్రరాజు ఉన్నారు.

➡️