కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలు

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : దివిస్‌ ఫార్మా పరిశ్రమ నుండి వేసిన పైప్‌ లైన్‌ తొలగించాలని మత్స్యకారులు చేపట్టిన దీక్షలు శనివారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ … పైపులైన్లను తొలగించకపోతే ఉద్యమాన్ని ఆపేదేలేదని స్పష్టం చేశారు. తమ సమస్యపై నేటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆదివారం ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన అరబిందో ఫార్మా పరిశ్రమలో వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు వేసిన పైపులైన్లను తొలగించాలని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొనపాపపేటలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళన నిన్న (శుక్రవారం) ఉద్రిక్తంగా మారింది. బోటును దహనం చేసి వారు నిరసన తెలిపారు. మరికొంతమంది పెట్రోల్‌ పోసుకుని ఆందోళనకు దిగారు. వీటి వల్ల మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతుందని, తాము ఉపాధి కోల్పోతున్నామని వెంటనే వీటిని తొలగించాలని ఈ నెల 6వ తేదీ నుంచి కొనపాపపేటలో శాంతియుతంగా మత్స్యకారులు దీక్షలు కొనసాగిస్తున్నారు. నిన్న మత్స్యకారుల నిరసన ఉద్రిక్తంగా మారినప్పటికీ అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు.

మరింత సమాచారం కోసం … https://prajasakti.com/varthalu/state/extreme-tension-in-kakinada-fishermen-protest-over-petrol-spill/

➡️