‘పల్లెకు పోదాం’ – సంక్రాంతి వేళ హైవేలపై వాహనాల రద్దీ

చౌటుప్పల్‌ : సంక్రాంతి పండుగ వేళ …. ప్రయాణీకులతో ఆర్‌టిసిలు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో రహదారులపై ట్రాఫిక్‌ జాం ఏర్పడుతుంది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాటపట్టారు. ముఖ్యంగా ఎపి వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి వద్ద టోల్‌ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 టోల్‌ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.

➡️