జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని పవన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … టిడిపితో కలిసే ఎన్నికలకు వెళుతున్నామన్నారు. ఆ పార్టీతో కలిస్తే బలవంతులమవుతామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందన్నారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందన్నారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసునన్నారు. సిఎం జగన్‌కు ఊరంతా శత్రువులేనన్నారు. ఆయనపై వ్యక్తిగత కక్ష లేదని చెప్పారు. వైసిపి నేతలకు కష్టమొస్తే తన వద్దకు రావాలని పిలుపునిచ్చారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. 2024లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అని పవన్‌ అన్నారు.

➡️