చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు : మంత్రి జోగి రమేష్‌

అమరావతి : ‘ చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు ‘ అని మంత్రి జోగి రమేష్‌ దుయ్యబట్టారు. ఆదివారం మంత్రి రమేష్‌ తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ …. చంద్రబాబు, పవన్‌కు రాష్ట్ర అభివృద్ది కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. ఏ ఆధారాలతో పవన్‌.. ప్రధానికి లేఖ రాశారు అని ప్రశ్నించారు. పవన్‌ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇస్తున్నామని మంత్రి అన్నారు. పవన్‌కు ఎపిలో ఆధార్‌ కార్డు లేదునీ, ఓటు లేదనీ ఆరోపించారు. చంద్రబాబు తాబేదారుగా పవన్‌ పనిచేస్తున్నారు అని విమర్శించారు. చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు అని మండిపడ్డారు. ఎపిలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదని అన్నారు. 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించడం లేదా ? అంటూ మంత్రి నిప్పులుచెరిగారు. అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం తమది అని అన్నారు. పట్టాలతో సరిపెట్టకుండా 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారని అన్నారు. ఏం స్కాం జరుగుతుందో పవన్‌ చెప్పాలని అడిగారు. ” పవన్‌కు కనీసం బుర్ర లేదు.. జ్ఞానం లేదు…” స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం మీద పవన్‌ ఎందుకు లేఖ రాయలేదు ? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై పవన్‌ ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. స్కిల్‌ స్కాంలో పవన్‌కు వాటా ఉంది అని జోగి రమేష్‌ మండిపడ్డారు. చంద్రబాబు ఇళ్లు ఇస్తానని మోసం చేశారనీ.. అప్పుడు పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు.. అని మంత్రి నిప్పులుచెరిగారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయని చంద్రబాబును ప్రశ్నించావా ? అని అడిగారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో ? పవన్‌ ప్రశ్నించారా ? అని అడిగారు. పవన్‌కు బుద్ది ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలి అని అన్నారు. ” ఏ గ్రామానికైనా వెళదాం.. ఎవరు ఇల్లు ఇచ్చారో ? అడుగుదాం. ఏ సంక్షేమ పథకం ఎవరు అమలు చేశారో ప్రజలనే అడుగుదాం ” అంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ చేశారు.

➡️