పెన్షన్‌ కోసం పడిగాపులు

Apr 3,2024 09:36 #issues, #olders, #Pension

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : పెన్షన్‌ సొమ్ము కోసం ఉదయం నుంచి సచివాలయాల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా బుధవారం తెల్లవారుజామునే తమ ఇళ్లకు పెన్షన్‌ సొమ్ము తెచ్చి ఇచ్చేవారని కానీ నేడు ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో పెన్షన్‌ సొమ్ముకు సచివాలయాల వద్ద ఉదయం నుండి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పెన్షన్‌దారులు వాపోతున్నారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని తెల్లవారుజామునే పెన్షన్లు ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తాపం తీవ్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దయచేసి తమకు తెల్లవారుజామునే పెన్షన్లు ఇప్పించాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇంటింటికి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పిన ఉన్నతాధికారులు ఆ విధంగా చేయకపోవడంతో తెల్లవారుజాము నుంచే వఅద్ధులు పడిగాపులు కాస్తున్నారు.

➡️