పింఛన్లు డీబీటీ ద్వారా పంపిణీ చేయాలి: వైఎస్‌ షర్మిల

Apr 1,2024 17:45 #Pension, #ys sharmila
Congress Election Committee headed by Sharmila

ఢిల్లీ : డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ఇవ్వాలని ఈసీ ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయడం లేదనిఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. పింఛన్లు పంపిణీ చేయకుండా వైసిపి ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. ఢిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ”డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ఇవ్వాలని ఈసీ ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయడం లేదు? ఈ విషయంపై సీఎస్‌తో మాట్లాడానని.. 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులు పింఛను అందుకునేందుకు 10 రోజులు నిరీక్షించాలా? డీబీటీ ద్వారా వెంటనే పింఛన్లను పంపిణీ చేయాలి.. లేకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతాం” అని షర్మిల హెచ్చరించారు.

➡️