నిధుల మంజూరు పత్రాల పేరుతో ప్రజలను మోసం చేశారు :సుంకేట రవి

Dec 31,2023 14:37 #congress leader, #press meet

కమ్మర్‌ పల్లి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పనులు చేయకుండా ఎన్నికల ముందు లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కుల సంఘాలకు నిధుల మంజూరు పత్రాల పేర్లతో బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం లో ఎన్నికల్లో లబ్ధి కోసమే కుల సంఘాలకు నిధుల పేరుతో, పేదలకు ఇండ్ల నిర్మాణం పేరుతో మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్స్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పేదలను ఆదుకోవాలని నిజంగా ప్రేమే ఉంటే బిఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 5 లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణాలు పూర్తి చేయించే వారన్నారు. కేవలం ఎన్నికలకు వారం రోజుల ముందు నిధుల మంజూరు పత్రాలను ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.కాంగ్రెస్‌ నాయకులు, సునీల్‌ రెడ్డి అభివఅద్ధిని అడ్డుకుంటున్నారని టిఆర్‌ఎస్‌ నాయకులు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. సునీల్‌ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ అభివఅద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో కలిసి అభివఅద్ధి జరిగేలా చేస్తారని తెలిపారు. బిఆర్‌ఎస్‌ నాయకులు అభివఅద్ధి విషయంలో కాంగ్రెస్‌ నాయకుల పై బట్ట కాల్చి మీద వేసే విధంగా వ్యవహరించొద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్‌, నాయకులు పాలెపు నరసయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్‌, నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్‌, సల్లూరి గణేష్‌ గౌడ్‌, వేముల చిన్న గంగారెడ్డి, సుంకేట శ్రీనివాస్‌, కౌడ శైలేందర్‌, నల్ల సాయికుమార్‌, ఆల్గోట్‌ రంజిత్‌, జైడి బాలకఅష్ణ, ఎడ్ల దీపక్‌ సాయి, సుంకరి గంగాధర్‌, మారయ్య, ఎడపల్లి రవి, కౌడ అరవింద్‌, పడాల గంగాధర్‌ ముత్యాల చంద్రకాంత్‌ రెడ్డి, పలారం పవన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️