ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో చాగల్లు హై స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : స్థానిక చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు వి.కార్తీక్‌, బి.అనుపమ ఇటీవల జరిగిన ఎన్‌.ఎం.ఎం.ఎస్‌ పరీక్షకు ఎంపికయ్యారు. విద్యార్థులు అభినందిస్తూ చాగల్లు ఎంఈఓ (2) సుధాకర్‌ విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే విద్యా ప్రోత్సాహకాలను పొందుతూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు. శిక్షణనిచ్చిన గణిత ఉపాధ్యాయులు మోహన కృష్ణ పలువురు అభినందించారు. గణిత ఉపాధ్యాయులు వి.శ్రీనివాస విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తరగతి ఉపాధ్యాయుడు టి.సత్తిరాజు, ఇతర ఉపాధ్యాయులు సాయిరాం శర్మ, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️