పాల్‌ పార్టీకి కామన్‌ సింబల్‌పై తీర్పు వాయిదా

Apr 1,2024 20:33

ప్రజాశక్తి-అమరావతి : లోక్‌సభకు జరగబోయే ఎన్నికల్లో తమ పార్తీకి ఉమ్మడి గుర్తు కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కిలారి ఆనంద్‌ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. పిటిషన్‌పై సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ తీర్పును వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.

➡️