డాక్టర్‌ కూటికుప్పలకు ప్రతిష్టాత్మక ఎండోమెంట్‌ పురస్కారం

May 11,2024 19:21 #puraskaram

విశాఖపట్టణం : విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావుకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. బెంగుళూరు యూనివర్శిటీలో ఈనెల 10,11,12 తేదీల్లో జరుగుతున్న 16వ అంతర్జాతీయ సోషల్‌ ఫిలాసఫీ, 10వ అరతర్జాతీయ యోగా, ఆధ్యాత్మిక శాస్త్రం సదస్సుల్లో ప్రతిష్టాత్మకమైన డాక్టర్‌ ఎ.హడింగాల్‌ ఎండోమెంట్‌ పురస్కారాన్ని అంతర్జాతీయ సదస్సులో అందజేశారు. గత మూడూ దశాబ్ధాలుగా వైద్యశాస్త్రం, సామాజిక, సాంకేతిక రంగాల్లో డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈపురస్కారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు ‘ఆరోగ్య వేదాంత జ్ఞానము-21వ శతాబ్ధంలో ఓ అద్భుత ఆవిష్కరణ’ అనే అంశంపై ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిజ్‌ హోలీనల్‌ శాంతా భీష్మాచౌడయ్య స్వామిజీ, డాక్టర్‌ అరుధాభారతి స్వామిజీ, సిద్ధుర్ధ మిషన్‌ ఆశ్రామాధిపతులు ప్రొఫెసర్‌ వై.వి.సత్యనారాయణ, సదస్సు కార్యనిర్వాహక అధ్యక్షులు బసవరాజ్‌ సిద్ధాశ్రమ, జస్టిస్‌ హెచ్‌ఎన్‌. నాగమోహన్‌దాస్‌, ప్రొఫెసర్‌ వి.వెంకటరావుతోపాటుగా దేశంలోని వివిధ ప్రాంతాలు, కొలంబో, యుఎస్‌ఎ తదితర దేశాల నుంచి ఆచార్యులు, రీసెర్చ్‌ స్కాలర్లు తదితరులు పాల్గన్నారు. గత రెండు దశాబ్దాలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా సూర్యారావు ఎయిడ్స్‌ రంగంలోనూ, ఇతర సామాజిక సేవారంగాల్లో అందిస్తున్న సేవలకు గాను ఇటీవల ఆయనకు దాసరి నారాయణరావు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందిన డాక్టరు కావటం, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టడంతో సూర్యారావును ఈ అవార్డుకు ఎంపిక చేసిన విషయం విధితమే.

➡️