రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు పూర్తి

Apr 10,2024 13:15 #complete, #last rites, #Rajeev Ratan's

హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు బుధవారం రాయదుర్గం ప్రస్థానంలో పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై నివాళులు అర్పించారు.
కాగా, రాజీవ్‌ రతన్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. రాజీవ్‌ రతన్‌ ప్రస్తుతం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొన సాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

➡️