హింసను ప్రేరిపిస్తున్న రాంగోపాల్‌ వర్మ చిత్రాలు

– సిఐడి విచారణకు హాజరైన శ్రీనివాసరావు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధిరాంగోపాల్‌ వర్మతో తనకు వ్యక్తిగత వైరం లేదని, ఆయన సినిమాల వల్ల హింసా ప్రవృత్తి, మహిళలపై అసభ్య భావజాలం పెంపొందిస్తున్నారనే కారణంగానే ఆయనపై ఈ వ్యాఖ్యలు చేశానని సిఐడి విచారణకు హాజరైన అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తలతెచ్చి ఇస్తే రూ.రెండు కోట్లు ఇస్తానని టివి చర్చలో ప్రకటించిన సందర్భంగా గుంటూరులోని ప్రాంతీయ సిఐడి కార్యాలయంలో విచారణకు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలపగా ఆయన తరుఫున న్యాయవాది లక్ష్మి నారాయణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణను సిఐడి అధికారులు విచారణకు అనుమతించారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని, విచారణ ప్రక్రియను వీడియో తీయాలని సాయికృష్ణ పట్టుబట్టారు. వ్యూహర సినిమాలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను కించపరచడాన్ని తట్టుకోలేక తాను ఈ విధంగా అనాల్సి వచ్చిందన్నారు. విచారణ ఈ నెల ఎనిమిదికి వాయిదా వేశారు. అంతకు ముందు సిఐడి అధికారులు 30 ప్రశ్నలతో విచారించినట్లు సమాచారం.

➡️