Rayalaseema యూనివర్సిటీ విసి రాజీనామా

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌ : రాయలసీమ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ సోమవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పంపారు. ఈ ఏడాది జనవరిలో వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్న క్రమంలో సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం రిజిస్ట్రర్‌ నాగుల అంకన్న కూడా రాజీనామా చేశారు.

➡️