‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులు విడుదల

Jan 23,2024 12:41 #ap cm jagan, #asara, #founds

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.6,394 కోట్ల నగదు జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో రూ.25,570 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందనాన్నరు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుందన్నారు.

➡️