కెఆర్‌ఎంబి పదేళ్ల నిధుల ఖర్చుపై రేపు సమీక్ష

Apr 20,2024 22:18 #krishna rivear, #KRMB

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) బడ్జెట్‌పై సోమవారం సమావేశం జరగనుంది. హైబ్రిడ్‌ మోడ్‌లో కెఆర్‌ఎంబి, తెలుగు రాష్ట్రాల సాగునీటి శాఖ ఉన్నతాధికారుల హాజరుకానున్నారు. 2014-15 నుంచి 2023-24 వరకు బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చు, తదితర అంశాలపై చర్చించనున్నారు. కొత్తగా 2024-25 బడ్జెట్‌ను ఆమోదించనున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కెఆర్‌ఎంబి బోర్డు నిర్వహణకు 50:50 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కెఆర్‌ఎంబికి రెండు రాష్ట్రాల నుంచి రూ.47.98 కోట్లు విడుదల కాగా, రూ.47.97 కోట్లు ఖర్చయినట్టు అధికారిక సమాచారం. దీనిపై సమావేశంలో మరోసారి చర్చించనున్నారు. కొత్త బడ్జెట్‌పైనా ప్రతిపాదనలు సమర్పిస్తారు. చర్చ అనంతరం ఆమోదం తీసుకోనున్నారు. కెఆర్‌ఎంబి చైర్మన్‌, మెంబర్‌ సెక్రెటరీ, ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

➡️