బస్సును ఢీకొన్న బైక్ – ఒకరు మృతి

road accident in tirumala

ప్రజాశక్తి-తిరుమల : ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సును ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన చోటుచేసుకుంది. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతిగా పోలీసులు గుర్తించారు. తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహనంలో త్రిబుల్ రైడింగ్ వస్తుండగా 16వ మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. తీవ్ర గాయాలైన జ్యోతిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించేందుకు పోలీసులు సిద్దమైయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు గాయాలు అయ్యాయి.

➡️