దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్

Apr 8,2024 14:38 #Chandrababu Naidu, #Disable, #Pension
  • చంద్రబాబు హామీ

ప్రజాశక్తి-సత్తెనపల్లి : టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తమ సమస్యలపై వినతిపత్రాన్ని చంద్రబాబుకు అందించిన దివ్యాంగులకు ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నేపథ్యంలో ప్రతీ యేటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను తరువాత రద్దు చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

➡️