ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సాయి శ్రీనివాస్‌, రఘునాథ్‌రెడ్డి

Feb 19,2024 20:14 #elections, #stu
  •  మరో 30 మందితో కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి – భీమవరం : ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్‌.సాయిశ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.రఘునాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. 30 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆడిటోరియంలో ఈ నెల 17 ,18న రెండు రోజులపాటు ఎస్‌టియు 77వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యవర్గ ఎన్నికకు హెచ్‌ఎం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

➡️